చదువరులకు విజ్ఞప్తి!
డా. పి. వి .ఎల్. సుబ్బారావు అనే నేను, ఇదివరలో, “ప్రేమ” శీర్షికతో మీ ముందుకు వచ్చాను. మీరందరూ ఎంతగానో ఆదరించారు. పుస్తక రూపంలో వెలువరించడానికి మొలక ఈ-పత్రిక వారు, శ్రీ వేదాంత సూరి గారు సహకరించారు. నా మిత్రుడు శ్రీ బొల్లాప్రగడ శేషు గారు ఎంతో ప్రేమగా దాన్ని పుస్తకరూపంలో ముద్రించారు.
ప్రస్తుతం నేను, “జీవన సార్థకత” శీర్షికతో, తే 03-09-2023 ది నుండి, మీ ముందుకు వస్తున్నాను. పంచపదులుగా సాగే రచన, రోజుకి మూడు చొప్పున, వాట్సాప్నందు ఉంచుతాను. చదివి మీ అభిప్రాయం తెలుపుతూ ప్రోత్సహించమని కోరుతున్నాను.
భవదీయుడు,
డా. పి. వి. ఎల్. సుబ్బారావు